హైదరాబాద్: సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. యశోదా ఆస్పత్రిలో చేర్చారు. శుభప్రదం చిత్రం ప్రమోషన్‌లో పర్యటించడం వల్ల ఆయన అస్వస్థతకు లోనయ్యారు. డాక్టర్లు ఆయనను రెండు రోజుల పాటు పరిశీలనలో ఉంచారు. ఆయనకు ప్రమాదం ఏమీలేదని డాక్టర్లు చెప్పారు.
వయసు మీద పడినా ఆయన శుభప్రదం వంటి చక్కటి ఫ్యామిలీ సినిమాను రూపొందించారు. శంకరాభరణం వంటి గొప్ప ప్రయోగాత్మక సినిమాను అందించిన ఘనత ఆయనది.