చిరంజీవి తెలంగాణలో పర్యటించగలరా?

తెలంగాణలోని 12 శాసనసభా నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను కూడా ఆయన నిలబెట్టలేక పోయారు. ఏదో సాకు చెప్పి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెసు పార్లమెంట సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకున్న తీరు తొలుత ఆయనకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీకి అభ్యర్థులనైతే దించారు గానీ ప్రచారానికి వెళ్లలేకపోయారు. తెలంగాణవాదాన్ని వినిపిస్తూ వచ్చిన తెలుగుదేశం తెలంగాణ నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో చంద్రబాబు దొడ్డి ప్రచారాన్ని ఎన్నుకున్నారు. బాబ్లీ వ్యతిరేక పోరాటం చేసి మహారాష్ట్రలో ఉండిపోయారు. జగన్ అనుభవం, చంద్రబాబు తీరు చూసిన తర్వాత తెలంగాణలో తాను తిరగడం సాధ్యం కాదని చిరంజీవి గ్రహించే ఉంటారని అంటున్నారు. ఆయన శాశ్వతంగానే తెలంగాణకు దూరమయ్యారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications