రెండు గ్రూపులుగా తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు ఎంపిలు

పార్లమెంటు సెంట్రల్ హాలులో ఇవాళ విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ను కలిసి తామంతా (కోస్తా, సీమాంధ్ర ఎంపీలు) మంగళవారం కలవదలచామని చెప్పగా, అందుకు ఆయన అంగీకరించారు. అదే రోజు రాత్రి వారంతా కావూరి సాంబశివరావు నివాసంలో భేటీ అయి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న వ్యూహరచనకు 'కౌంటర్' వ్యూహాన్ని రచించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, తెలంగాణ సెంటిమెంటును దృష్టిలో పెట్టకుని రాష్ట్ర విభజన చేసినప్పటికీ హైదరాబాద్ విషయం ఆలోచించాలని సోనియాకు చెప్పనున్నట్లు ఒక సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు అన్నారు.












Click it and Unblock the Notifications