పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ రాజీనామా చేస్తారా?

వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేదని, సోనియా గాంధీ సూచన మేరకే తాను ఎన్నికల్లో పోటీ చేశానని ఆయన సోమవారం పార్టీ సమీక్షా సమావేశంలో చెప్పుకున్నారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, దానివల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిచిందని ఆయన అన్నారు. పార్టీ ఫలితాల పట్ల ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కూడా తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన నాడే తన పేరు మీద ఇషాన్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఆయనను తీవ్రంగా ఆవేదనకు గురి చేసినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో పదవిలో కొనసాగడం మంచిది కాదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, త్వరలోనే సంస్థాగత ఎన్నికలు జరిగి పిసిసి అధ్యక్ష ఎన్నిక జరగనుంది. అప్పటి వరకు కొనసాగాలని అధిష్టానం ఆయనకు సూచించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications