జగన్ వైయస్ కొడుగ్గా పుట్టడమే తప్పా: కొండా సురేఖ

తాము ప్రభుత్వంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వంపై విమర్శలు చేసేవారమని ఆమె అన్నారు. రాష్ట్రంలో బలహీనమైన నాయకత్వం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పరిస్థితులను అవగతం చేసుకుని తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని ఆమె పార్టీ అధిష్టానాన్ని కోరారు. బలమైన వృక్షంగా ఉన్న కాంగ్రెసు పార్టీకి చెందిన ఒక్కో కొమ్మనే నరుక్కుంటూ పోతున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆమె సోనియాను కోరారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు వ్యక్తమైన తీరును గమనించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications