వైయస్ జగన్ కు సోనియా గాందీ పరోక్ష హెచ్చరిక

YS Jagan
న్యూఢిల్లీ: తమను ధిక్కరించే ధోరణిలో వ్యవహరిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరోక్ష హెచ్చరిక చేశారు. కాంగ్రెస్‌వాదులెవరూ తమను తాము గొప్పగా ఊహించుకొంటూ అత్యాశలకు పోరాదని, తమ వ్యక్తిగత కోరికలను నెరవేర్చుకునేందుకు రాజకీయాలను ఒక సాధనంగా వాడుకొనే ప్రయత్నం చేయరాదని ఆమె సూచించారు. రాజకీయాలలో ప్రతి ఒక్కరికీ వారి శక్తిసామర్థ్యాలకు తగినట్లుగా సహేతుకమైన పాత్ర లభించాల్సిందేనని, అయితే సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయాలను కొద్దిమంది వ్యక్తుల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టరాదని కూడా కాంగ్రెస్‌వాదులంతా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని ఆమె అన్నారు. పార్టీ అధికార మాసపత్రిక 'కాంగ్రెస్‌ సందేశ్‌'లో రాసిన సంపాదకీయంలో ఆమె ఆ విధంగా అన్నారు.

రాజకీయాల్లో కొన్ని సందర్భాలలో తమను తాము ఎక్కువగా ఊహించుకొనే అహంభావ ధోరణులు, నిరాధారమైన దృక్పథాలు కొంతమంది పార్టీ నేతల చర్యలను ప్రభావితం చేస్తున్న సందర్భాలు లేకపోలేదని అంటూనే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ వాదులు అకస్మాత్తుగా ఉన్నతస్థానాలకు ఎదగాలన్న తమ వ్యక్తిగత వాంఛలను నెరవేర్చుకొనేందుకు రాజకీయాలను వాడుకోవడాన్ని సహించలేమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆమె జగన్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవేనని భావిస్తున్నారు. వైయస్ మరణం తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం కోసం వ్యవహరిస్తున్న తీరుపైనే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+