వైయస్ జగన్ వర్గం ఎదురు దాడి: అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

Ambati Rambabu
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎదురు దాడికి దిగింది. సస్పెన్షన్ కు గురైన అంబటి రాంబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యపై మరింత తీవ్రంగా వ్యాఖ్యానించారు. వయస్సులో పెద్దవారైన ముఖ్యమంత్రి మనసు చిన్నది చేసుకోవద్దని ఆయన అన్నారు. జగన్ వర్గానికి చెందిన వారినందరిపై మూకుమ్మడిగా సస్పెండ్ చేసేందుకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. జగన్ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆయన అన్నారు. కొండా సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం కంతేటి సత్యనారాయణ రాజు నేతృత్వంలోని క్రమశిక్షణా సంఘానికి లేదని ఆయన అన్నారు. ఎఐసిసి గానీ పిసిసి గానీ ఆదేశిస్తే విచారణ జరిపే కమిటీ మాత్రమేనని ఆయన అన్నారు. తమ వంటి వారినంతా పంపించేస్తే చెరువు ఖాళీ అవుతుందని, కాంగ్రెసు పార్టీని నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. తమను పార్టీ నుంచి బయటకు పంపే ఏర్పాటు చేయవద్దని ఆయన సూచించారు.

పార్టీ నిబంధనావళికి వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. తనను ఈ నెల 6వ తేదీన హాజరు కావాలని క్రమశిక్షణా సంఘం ఎందుకు పిలిచిందో తెలియదని ఆయన అన్నారు. తాను పార్టీ నిబంధనావళికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. కురు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే పెద్దలెవరూ మాట్లాడనట్లుగానే నిబంధనావళికి వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేస్తే ఎవరూ మాట్లాడడం లేదని, అందుకే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తనను సస్పెండ్ చేసిన విషయం తనకు తెలియకుండానే మీడియాకు తెలుస్తుందని, గట్టు రామచందర్ రావును కిసాన్ సెల్ పదవి నుంచి తొలిగించివ విషయన ఆయనకు తెలియకుండానే మీడియాకు తెలుస్తుందని అంబటి రాంబాబు అన్నారు. మీడియాకు విషయాలు తెలియజేస్తూ తమకు తెలపడమేమిటని ఆయన అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం అవాస్తవం లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్తున్న శాసనసభ్యులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని చర్యలకు దిగుతోందని ఆయన అన్నారు. వైయస్ వర్గాన్ని భూస్థాపితం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. పార్టీలో ఉండే తాము పోరాటం చేస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+