తెలంగాణపై పార్టీ సీనియర్లకు చంద్రబాబు నాయుడు క్లాస్

బాబ్లీ ప్రాజెక్టుపై శ్రీరాంసాగర్ పరివాహకప్రాంతంలో పాదయాత్ర నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది.ఈ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. అన్నీ రాజకీయపక్షాల నేతలను ఈ యాత్రలో కలుపుకుపోవాలని పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. బాబ్లీపై గ్రామస్థాయిలో రైతుల్ని చైతన్యం చేసేందుకు అవగాహన కల్పిస్తామని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో ఎర్రబెల్లి ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇతర పార్టీలతో కలిపి ఈ కమిటీ వేస్తామని ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తమ యాత్ర తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications