వైయస్ జగన్ ను రెచ్చగొట్టేందుకే హై కమాండ్ యాక్షన్

జగన్ వర్గానికి చెందిన గట్టు రామచందర్ రావును చెప్ప పెట్టకుండా కిసాన్ సెల్ పదవి నుంచి తప్పించారు. గీత దాటి వ్యవహరిస్తూ జగన్ కు కొమ్ము కాస్తున్న నాయకులను ఏ మాత్రం సహించబోమని కొండా సురేఖకు నోటీసు జారీ చేయడం ద్వారా అధిష్టానం ఓ హెచ్చరిక చేసినట్లు కూడా తెలుస్తోంది. తన వర్గానికి చెందినవారి చేత వరుసగా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయిస్తూ తన వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం తీసుకోవాలని యోచిస్తున్న జగన్ ను రెచ్చగొట్టడమే ధ్యేయంగా అధిష్టానం కదులుతున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి కాంగ్రెసు రాజకీయాలు రసకందాయంలో పడతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications