మరో బహిరంగ లేఖ రాస్తా: తెగించిన కొండా సురేఖ

తనను బలిపశువును చేసినా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కావపడానికి తాను చేసిన సూచనలను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోవాలన్నదే తన అభిమతమని ఆమె అన్నారు. తనపై వేటు వేయగలరు గానీ ప్రజల మనోభావాలపై ఎలా వేటు వేయగలని ఆమె అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేసినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. సోనియా గాంధీని, వీరప్ప మొయిలీని, వైయస్ ను గతంలో కొంత మంది నాయకులు విమర్శించారని, వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications