ప్రముఖ సాహితీవేత్త కోవెల సంపత్కుమారాచార్య కన్నుమూత

అలంకార, ఛందో శాస్త్రాల్లో ఆయనది అందె వేసిన చేయి. ఆయన రాసిన తెలుగు ఛందో అలకార శాస్త్ర గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విశ్వనాథ అసంకలిత సాహిత్యాన్ని సాహిత్య లోకానికి అందించే పనిలో నిమగ్నమైన ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. అలంకార, ఛందో శాస్త్రాలు, తెలంగాణ సాహిత్యం ఆయనకు ప్రియమైనవి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన అవార్డు తీసుకున్నారు. ఆయన మృతికి ప్రముఖ సాహిత్యవేత్త ఎస్వీ రామారావు సంతాపం ప్రకటించారు. కోవెల మృతి తెలుగు సాహిత్య విమర్శకు తీరని లోటు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications