వైయస్ జగన్ తో కెవిపి రామచందర్ రావు భేటీ: భవిష్యత్తు వ్యూహంపై చర్చ

తాము తాజా పరిణామాలపై సీరియస్ గా చర్చించలేదని సబ్బం హరి ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. అయితే చర్చ జరిగిన విషయాన్ని ఆయన పూర్తిగా కొట్టేయలేదు. బహిరంగ లేఖ రాస్తున్న విషయాన్ని సురేఖ జగన్ కు ముందు చెప్పలేదని ఆయన అన్నారు. జగన్ విషయంలో పార్టీ అధిష్టానం పూర్తిగా సమీక్షిస్తుందని, అందరి అభిప్రాయాలూ తీసుకుంటుందని ఆయన అన్నారు. జగన్ పై వస్తున్న ఫిర్యాదుల్లోని నిజానిజాలను తేల్చుకుంటుందని ఆయన అన్నారు. కొండా సురేఖ విషయంలో జరిగిన పరిణామాల పట్ల జగన్ ఆవేదన చెందుతున్నారని ఆయన చెప్పారు. తాజాగా అంబటి రాంబాబు పార్టీ పెద్దలపై ధ్వజమెత్తిన నేపథ్యంలో జగన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications