• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుమలపై చంద్రబాబు తీరు మీద శంకర రావు ధ్వజం

By Pratap
|

Shankar Rao
హైదరాబాద్‌: తిరుమలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదరక్షలతో వెళ్లడాన్ని కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకరరావు తప్పు పట్టారు. తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై తక్షణం విచారణ జరిపించాలని సికింద్రాబాద్‌ శంకర్రావు సీఎం రోశయ్యను కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వాస్తవ దృష్టితో ఆలోచించాలని సూచించారు.

వాస్తవ పరిస్థితులపై నివేదిక తెప్పించుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు అలిపిరి నుంచి పాదరక్షలతో కొండపైకి వెళ్లడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X