రాజీనామాకు సిద్ధపడుతున్న వైయస్ సతీమణి విజయమ్మ?

YS Vijayalakshmi
హైదరాబాద్: శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు దివంగత నేత వైయస్సార్ సతీమణి విజయమ్మ సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయమ్మ చేత రాజీనామా చేయించే విషయంపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం వ్యూహాన్ని ఎదుర్కునేందుకు ప్రతివ్యూహంగా విజయమ్మ చేత రాజీనామా చేయించాలనే ఆలోచనపై జగన్ వర్గం చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి బాలిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వైయస్ తోడల్లుడు సుబ్బారెడ్డి తమ వర్గానికి చెందిన నాయకులతో నెల్లూరులో ఈ విషయంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.

వైయస్ సతీమణిగా విజయమ్మ రాజీనామా చేస్తే ప్రజల్లో విశేషమైన సానుభూతి లభిస్తుందని, అది రాజకీయంగా తమకు ఉపయోగ పడుతుందని జగన్ వర్గం ఆలోచనగా చెబుతున్నారు. విజయమ్మ రాజీనామాకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ మరణంతో ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గం నుంచి విజయమ్మ ఏకగ్రీవంగా శాసనసభకు ఎన్నికయ్యారు. జగన్ పోటీకి అధిష్టానం అంగీకరించలేదు. విజయమ్మ పేరును పులివెందుల నియోజకవర్గానికి ఖరారు చేసింది.

విజయమ్మ రాజీనామా చేస్తే ఆరు నెలలలోగా ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అది కూడా జగన్ రాజకీయానికి పనికి వస్తుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేసి శాసనసభకు రావాలనేది కూడా ఆమె చేత రాజీనామా చేయించాలనే ఎత్తుగడలో ఓ భాగమని అంటున్నారు. మొత్తం మీద, కాంగ్రెసు రాజకీయాలు మరో మలుపు తిరగడానికి రంగం సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+