వైయస్ జగన్ కు చిరంజీవి భయపడి వెనక్కి తగ్గారా?

జగన్ వర్గానికి భయపడి చిరంజీవి వెనక్కి తగ్గారనే ప్రచారం సోమవారం ఊపందుకుంది. చిరంజీవి ఈ మధ్య కాలంలో కడప జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన వ్యాఖ్యల వల్ల ఆ పర్యటనకు ఆటంకాలు ఏర్పడతాయనే భయంతోనే చిరంజీవి వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. దానికితోడు, చిరంజీవి స్వభావం కూడా వెనక్కి లాగేలా చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సహజంగానే చిరంజీవిది ప్రతి విషయంలోనూ ఊగిసలాట ధోరణి. ఆ ఊగిసలాటనే ఇందుకు దారి తీసిందని అంటున్నారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయనే విషయం చిరంజీవికి అర్థమైంది. ప్రతి చోటా ఆ వివాదం గురించి ప్రస్తావన వస్తుందని, దానికి కట్టుబడి మాట్లాడడం కష్టమని ఆయన భావించి ఉంటారు. అందుకే ఆయన తన వ్యాఖ్యల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు పూనుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications