ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. వీరాస్వామి అనే రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు మోటారుసైకిళ్లతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికిచంపారు. స్థానిక జయరామ్ థియేటర్ వద్దనుంచి వీరాస్వామిని వెంటాడి చంపారు.
అక్రమ సంబంధాలు, పాత కక్షలు వీరాస్వామి హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.