చిరంజీవిపై రాజశేఖర్ దంపతుల పాత పగ కొత్తగా?

చిరంజీవిపైకి అస్త్రాలు దూయడానికి సిద్ధంగా ఉన్న రాజశేఖర్, జీవితను దించడమే మంచిదని జగన్ వర్గీయులు భావించి వారిని దించినట్లు అనుమానిస్తున్నారు. వారి వెనక వేరే వారు ఉన్నారని ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఆరోపించడంలోని అంతరార్థం అదే. జీవిత, రాజశేఖర్ లపై గతంలో చిరు అభిమానులు హైదరాబాదులో దాడి చేశారు. ఈ సమయంలో చిరంజీవి స్వయంగా వారి ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరారు. అటువంటి ఘర్షణను ఆశించే రాజశేఖర్, జీవిత చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications