కె చంద్రశేఖర రావుపై హరికృష్ణ దాడి మతలబు ఏమిటి?

పార్టీ సీనియర్ నాయకుల సమావేశాల్లో పలు మార్లు చంద్రబాబు ఆ విషయాన్ని ప్రస్తావించారు. తెరాస దాడులను తిప్పి కొట్టాలని ఆయన తెలంగాణ సీనియర్ నాయకులకు సూచించారు. అయినా, నాగం జనార్దన్ రెడ్డి వంటి నాయకులు పెద్దగా మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసేందుకు కెసిఆర్ కుట్ర చేస్తున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఒక పార్టీ దెబ్బ తినకుండా తగిన విధానాలను, వైఖరులను తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని విస్మరించి చంద్రబాబు కెసిఆర్ పై ఎదురుదాడి చేయాలని సూచించడం తెలంగాణ టిడిపి నాయకులకు రుచించడం లేదు. ఎదురు దాడి ఎలా చేయాలో కూడా వారికి తెలియడం లేదు. ఈ స్థితిలోనే హరికృష్ణ కెసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications