రాష్ట్ర నాయకత్వంపై డిఎస్ నిర్వేదం: హస్తన వైపు చూపు

Srinivas
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు రాష్ట్ర నాయకత్వం ఏ మాత్రం రుచించడం లేదని వార్తలు వస్తున్నాయి. తనను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతున్నట్లు సమాచారం. పిసిసి అధ్యక్షుడిగా రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకు కూడా దక్కుతుంది. అయితే, ఆయన ఆ పదవితో పూర్తిగా విసిగిపోయారని చెబుతున్నారు. దీంతో తనను ఎఐసిసిలోకి తీసుకోవాలని ఆయన మేడమ్ ను కోరినట్లు సమాచారం.

కాగా, డిఎస్ ను కొనసాగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కొనసాగడానికి ఆయన ఇష్టంగా లేరని తెలుస్తోంది. పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చి, తాను నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయిన తర్వాత పిసిసి పదవి నుంచి తనను తప్పించాలని డిఎస్ అధిష్టానాన్ని కోరారు. అయితే అందుకు అధిష్టానం అంగీకరించలేదు. దాంతో ఆయన ఇప్పటి వరకు కొనసాగారు. తాజాగా, మరోసారి నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయిన తర్వాత ఆయనను మరింత నిర్వేదం ఆవరించినట్లు చెబుతున్నారు. దీంతో తన కోరికను మన్నించాలని ఆయన గట్టిగా కోరినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ కొత్త పిసిసి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. అప్పటి వరకు మాత్రమే డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.

కాగా, పిసిసి అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి కె. జానారెడ్డి, తాజా మంత్రి జె. గీతారెడ్డి, ఎంపి నంది ఎల్లయ్య, మల్లు రవి తదితరులు పిసిసి పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+