కెవిపి మెడకు చుట్టుకుంటున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్

ఎమ్మార్ ప్రాపర్టీస్ లోనే కాకుండా ఎపిఐఐసి వివిధ సంస్థలకు అప్పగించిన ప్రభుత్వ భూముల్లో 50 వేల కోట్ల రూపాయలకు పైగా లూటీ జరిగిందట. దీనికి సంబంధించి ఓ ముఖ్యనేత కాంగ్రెసు అధిష్టానానికి నివేదిక అందించారని తెలుస్తోంది. ఆ నివేదికలో జగన్ పైనే కాకుండా కెవిపిపైనా ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, కెవిపిల పాత్ర, 2007 తర్వాత వైయస్ జగన్ పాత్ర ఉందని ఆరోపించినట్లు తెలుస్తోంది. విశాఖలో ఎపిఐఐసి యూనిటెక్ కు కారు చౌకగా 1750 ఎకరాల భూమిని అప్పగించడంలో వైయస్ తోడల్లుడు సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎపిఐఐసి భూబదలాయింపులపై ఆంధ్రజ్యోతి సవివరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది.












Click it and Unblock the Notifications