వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ పై సోనియా గాంధీ డైరెక్ట్ అటాక్

జగన్ ను వ్యతిరేకించేవారని ప్రోత్సహించాలని కూడా ఆమె సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులను గుర్తించాలని ఆమె ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఒత్తిడి ఎదుర్కుంటున్న దళిత శాసనసభ్యులకు నచ్చజెప్పాలని ఆమె సూచించారు. రేపు టికెట్లు ఇచ్చేది తామేనని ఆమె చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర రాజకీయ లబ్ధి కోసమే చేపట్టారని ఆమె వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్ర తీరే ఆ విషయాన్ని తెలియజేస్తోందని, తాను ఓదార్పు యాత్రను తీరును వ్యతిరేకించానని ఆమె చెప్పారు.