పెద్దల ఎమ్మార్ ప్రాపర్టీస్ గుట్టు విప్పిన ఈనాడు డైలీ

ఈనాడు వార్తాకథనం వివరాల ప్రకారం - రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు భార్య కోటగిరి సునీత పేరు మీద 1277 గజాల స్థలం రిజిష్టర్ అయింది. దీని విలువ దాదాపు 5.1 కోట్లు రూపాయలు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరు మీద 1171 గజాల భూమి ఉంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ సుధీర్ రెడ్డి, ఆయన భార్య వైయస్ విద్యారెడ్డి పేరు మీద 1201 గజాల స్థలం ఉంది. తెలుగుదేశం పార్టీ నేత టి. దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ పేరు మీద 1332 గజాల స్థలం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోడలు, బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి పేరు మీద 2440 గజలా స్థలం ఉంది. సినీ నటుడు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ పేర్ల మీద 1328 గజాల స్థలం రిజిష్టర్ అయింది. ఎల్బీ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు డి. సుధీర్ రెడ్డి భార్య కమలారెడ్డి పేరు మీద 1122 గజాల స్థలం ఉంది.
ఇలా మరి కొందరి పేర్లను కూడా ఈనాడు దినపత్రిక వెల్లడించింది. ఆ భూముల విలువను కూడా తెలిపింది. ఒక్కొక్కరి పేరు మీద రిజిష్టర్ అయిన భూమి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. వాటి విలువను చూస్తే సామాన్యుడి కళ్లు బైర్లు కమ్ముతాయి. అంత విలువైన భూములను, అంత పెద్ద యెత్తున కొందరికి కట్టబెడతారని వారు ఊహించి ఉండరు.












Click it and Unblock the Notifications