చిరంజీవిపై సినీ నటి జీవిత మెగా ఆటాక్

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తనకున్న మెగా ఇమేజ్ మీద మాత్రమే ఆధారపడాల్సి ఉంటుందని, చిరంజీవి ప్రజా సేవ చేసినవారు కారని, అందువల్ల రాజకీయాల్లోకి చిరు పనికి రారని చెప్పామని ఆమె అన్నారు. పాతికేళ్లుగా చిరంజీవిని చాలా దగ్గరి నుంచి చాశామని, చిరంజీవి వల్ల ప్రజలకు నష్టం జరగకూడదని మాట్లాడుతున్నామని ఆమె అన్నారు. తాము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నామని ఆమె చెప్పారు. తొలుత తాము చిరంజీవిని వ్యతిరేకించినప్పుడు గానీ ఇప్పుడు గానీ తమ వెనక ఎవరూ లేరని ఆమె చెప్పారు.
భార్యతో వచ్చిన మాట్లాడుతున్నాడని రాజశేఖర్ పై ప్రజారాజ్యం పార్టీ నాయకులు మాట్లాడడాన్ని ఆమె తప్పు పట్టారు. చిరంజీవి మహిళలకు ఇచ్చే గౌరవం ఇది అని ఆమె అన్నారు. భార్యతో వస్తే తప్పా అని ఆమె అడిగారు. తనకు తెలుగు సరిగా రాదని మొదటి నుంచీ చెబుతున్నానని, ఆ విషయాన్ని తాను దాచుకోవడం లేదని రాజశేఖర్ అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కమర్షియల్ గా నడుస్తోందని, ప్రతి యేటా ఆడిటింగ్ జరగాలని ఆయన అన్నారు. నాలుక కోస్తామని అల్లు అరవింద్ అనడంపై ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. సచివాలయానికి వెళ్లి అరవింద్ నాటకమాడారని ఆయన అన్నారు. హరికిషన్ గౌడ్ అనే వైద్యుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తీరుపై, బ్లడ్ నడవాల్సిన తీరుపై వివరించారు. రాష్ట్రంలోని ఏ బ్లడ్ బ్యాంక్ కు కూడా ఉచితంగా స్థలం ఇవ్వలేదని, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ఇచ్చారని, ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందుతోందని రాజశేఖర్ చెప్పారు.












Click it and Unblock the Notifications