హైదరాబాద్: ఉద్యానశాఖ నిర్వహిస్తున్న నర్సరీ మేళా-2010ను ముఖ్యమంత్రి రోశయ్య హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బండ కార్తీకరెడ్డితో పాటు ఉద్యానశాఖ అధికారులు హాజరయ్యారు. ఐదురోజుల పాటు సాగే ఈ మేళాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పండ్లు, పూలమొక్కలు, చెట్లు, విత్తనాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు.