కడప: కడప ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడరని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. జగన్ కొత్త పార్టీ కూడా పెట్టరని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానవర్గం దిగిరాని నేపధ్యంలో జగన్ కొత్త పార్టీ పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. అంత సాహసం ఆనాడు తండ్రి రాజశేఖరరెడ్డే చేయనప్పుడు ఇంత చిన్న పిల్లాడు ఎలా చేస్తాడు? జగన హైకమాండ్ కు అనుకూలంగా ఉంటే, అదికూడా మరో మూడేళ్ళు అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.