బద్మాష్ వందేమాతరం శ్రీనివాస్ పై ఒయు జెఎసి ఫైర్

Vandemataram Srinivas
హైదరాబాద్: బద్మాష్ సినిమా దర్శకుడు, సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (ఒయు జెఎసి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వందేమాతరం శ్రీనివాస్ ను తెలంగాణ ద్రోహిగా ప్రకటించింది. బద్మాష్ సినిమాను బహిష్కరించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానాలు జరుగుతుంటే, అత్మహత్యలు చేసుకోవద్దని ఉపదేశం చేస్తూ పాట పాడాలని అడిగితే వందేమాతరం శ్రీనివాస్ నిరాకరించారని జెఎసి నాయకుడు ఎల్లన్న చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కోసం, చంద్రబాబు కోసం, వైయస్ జగన్ కోసం పాటలు పాడడానికి శ్రీనివాస్ కు సమయం ఉంటుందని, తెలంగాణ ప్రజల కోసం పాడడానికి సమయం ఉండదా అని ఎల్లన్న అడిగారు. తెలంగాణ ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా వందేమాతరం శ్రీనివాస్ పాడితే ప్రజల్లోకి వెళ్తుందని తాము భావించామని ఆయన చెప్పారు.

బద్మాష్ సినిమాలోని దృశ్యాలు అశ్లీషంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. మందు కొట్టు...అనే పాట అశ్లీషంగా ఉందని ఆయన అన్నారు. సమయం లేకపోవడం వల్లనే తాను తెలంగాణ విద్యార్థుల కోసం పాట చేయలేకపోయానని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. తాను జగన్ కోసం పాట చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం నాలుగైదేళ్ల క్రితం పాట పాడానని, ఇటీవలి కాలంలో పాడలేదని ఆయన చెప్పారు. బద్మాష్ సినిమా షూటింగ్ పూర్తవుతోందని, విద్యార్థులు వచ్చి పాట పాడాలంటే పాడుతానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+