జీవిత, రాజశేఖర్ లకు చంపుతామని బెదిరింపులు

Jeevitha-Rajasekhar
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై విమర్శలు మానకపోతే చంపేస్తామంటూ సినీ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులకు బెదిరింపులు వచ్చాయి. చిరంజీవిపై ఆరోపణలు మానుకోకపోతే మానవబాంబు దాడులు జరుగుతాయని ఆగంతకులు మెసేజ్ లు పంపారు. ఈ మేరకు రాజశేఖర్, జీవిత దంపతులు హైదరాబాదులోని జూబిలీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబిలీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాపునాడు సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ పేరు మీద ఓ సందేశం వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ 9963561116. ఈ ఫోన్ నెంబర్ శ్రీనివాస్ కు చెందింది. అయితే ఆ మెసేజ్ శ్రీనివాస్ పంపాడా, ఆయన పేరు మీద మరెవరైనా పంపారా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో నాలుగు ఫోన్ ల నుంచి కూడా మెసేజ్ లు వచ్చాయి. వాటికి కాల్ చేస్తే రెండు స్విచ్ఫాఫ్ చేసి ఉన్నాయి. మరో రెండు రింగతువుతున్నాయి. కానీ ఎవరూ ఎత్తడం లేదు. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు చిరునామాలు, ఫోన్ యజమానుల పేర్లను సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+