వైయస్ జగన్ కు అండగా ఉండడం తప్పా: కొండా సురేఖ

తమ కుటుంబానికి ప్రభుత్వం గన్ మెన్లను తగ్గించి, తన నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఇంచార్జీకి పెంచారని ఆమె విమర్శించారు. దురుద్దేశపూరితంగానే తమకు గన్ మెన్లను తగ్గించారని ఆమె విమర్శించారు. తమకు ప్రాణహాని జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. తమను ఇబ్బంది పెట్టేందుకే పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నారని, తమ నియోజకవర్గంలో పోలీసులను తమకు చెప్పకుండా బదిలీ చేస్తున్నారని ఆమె విమర్శించారు. జగన్ కడప జిల్లా ఎస్పీనే బదిలీ చేసినప్పుడు తామెంత అని ఆమె అన్నారు. తనకు అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు రావడం వెనక ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆమె విమర్శించారు. తమను ఇబ్బంది పెట్టినా ఫర్వాలేదని, అయితే తన అనుచరులను ఇబ్బంది పెట్టవద్దని ఆమె అన్నారు. తమ అనుచరులపై తప్పుడు కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనను ఆమె రాజకీయ వ్యభిచారిగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications