'సత్యం' రామలింగ రాజుకు హైకోర్టు షరతులతో బెయిల్

రామలింగరాజుకు కొంత కాలం పాటు బెయిల్ ఇవ్వకూడదని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. గత 19 నెలలుగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా గత 52 వారాలుగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. మరో ఆరు వారాల పాటు రామలింగరాజుకు వైద్యం అవసరమని నిమ్స్ వైద్యులు చెప్పారు. సత్యం కుంభకోణం కేసులోని నిందితులందరికీ బెయిల్ లభించింది. ఏడు వేల కోట్ల సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో రామలింగరాజు 2009 జనవరి 8వ తేదీన అరెస్టయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications