జగన్ కు వైయస్ వివేకానంద రెడ్డీ దూరమే: సోనియాకు లేఖ

కాగా, కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో వైయస్ వివేకానంద రెడ్డి చేత రాజీనామా చేయించి వైయస్ జగన్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, సోనియా గాంధీ కలగజేసుకోవడంతో అప్పుడు అది ఆగిపోయింది. సాధారణ ఎన్నికల సమయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డికి కాకుండా తన కుమారుడు వైయస్ జగన్ కు లోకసభ సీటు ఇప్పించుకున్నారు. దాంతో వివేకానంద రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications