చంద్రబాబు నాయుడి చూపు ఆంధ్రా వైపు: కె. చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రా మనిషి, ఆయన రెండు కళ్లు చూస్తోంది ఆంధ్రావైపేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ధ్వజమెత్తారు. టిడిపి ముమ్మాటికీ ఆంధ్రాపార్టీనే ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుతో శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇప్పించాలని, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు బానిసత్వం నుంచి విముక్తి పొందిన రోజును ఘనంగా జరుపుకుంటున్నాయని, తెలంగాణలో మాత్రం ప్రజలు తాము విముక్తి పొందిన రోజును మరచిపోవాలని పాలకులు కుటిలయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15న స్వాతంత్య్రం రాలేదు. సెప్టెంబరు 17న స్వాతంత్య్రం వచ్చిందని, ఆ రోజును ప్రభుత్వం అధికారికంగా జరపడంలేదని ఆయన అన్నారు. సీఎం రోశయ్య స్పందించి దీన్ని అధికారికంగా జరపాలని, చంద్రబాబు దీనిపై స్పందించాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు.

గురువారం కేసీఆర్‌ సమక్షంలో వరంగల్‌ జిల్లా టిడిపి నాయకుడు దొమ్మాటి సాంబయ్య, ఆ పార్టీ ములుగు జడ్పీటీసీ సభ్యురాలు అలీలా గోవిందనాయక్‌, కార్పొరేటర్‌ నన్నపనేని నరేందర్‌ తదితరులు తెరాసలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ నాయకుడు శంకర్‌నాయక్‌, టిడిపి ఆదిలాబాద్‌ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్దన్‌రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. ఇటీవల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెదేపా కుట్రలను ప్రజలు చేధించి తీర్పును ఇచ్చారన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాళ్లకింద భూమి కదులుతుండడంతో ఆ పార్టీ నేతలు నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

టిడిపి నాయకులు అసంబద్ధ ప్రేలాపనలు ఆపి తెలంగాణ ప్రజలతో కలసి వస్తారో, చస్తారో తేల్చుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ప్రజలు కిందవేసి తొక్కారని, తెలంగాణవాదాన్ని గెలిపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. రాష్ట్రం ఏర్పడితే 85 శాతం ఉన్న బడుగు, బలహీన, ముస్లిం వర్గాలు బాగుపడుతాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెరాస పార్టీ పనిచేస్తుందన్నారు. ఏ పార్టీలోనూ విలీనం కాదని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+