వైయస్ జగన్ వెనక్కి తగ్గరు: బాలినేని శ్రీనివాస రెడ్డి

Balineni Srinivas Reddy
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెనక్కి తగ్గరని రాష్ట్ర గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. పావురాలగుట్ట సాక్షిగా ఇచ్చిన మాటను జగన్ వెనక్కి తీసుకోలేరని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓదార్పు యాత్ర విషయంలో ఎవరు కూడా ఎవరినీ బలవంత పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంతకు ముందు సిద్ధం చేసిన రోడ్డు మ్యాప్ ప్రకారమే ఓదార్పు యాత్ర జరుగుతుందని ఆయన చెప్పారు.

స్వచ్చందంగా వచ్చే శాసనసభ్యులను తాము ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర కచ్చితంగా జరుగుతుందని, విజయవంతమవుతుందని ఆయన అన్నారు. ప్రజలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు ఓదార్పు యాత్ర జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ విగ్రహాలను నాయకులు ఎవరు ప్రతిష్టించడం లేదని, ప్రజలే తమంత తాముగా విగ్రహాలను గ్రామాల్లో పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+