శ్రీకాంత్ భూమి వివాదం: కాకాపై కేసులు

శ్రీకాంత్ సోదరుడు అనిల్, మరదలు మేఘ, మరో నటుడు శివాజీలతో కలిసి శ్రీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పత్రాలను అందజేశారు. గతంలోనూ వెంకటస్వామి బెదిరించారని, జెండాలు పాతి బెదిరించడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పట్టా భూమిని తాము చట్టపరంగా కొనుగోలు చేశామని, తమ దగ్గర డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు, పహాణీలు అన్నీ ఉన్నాయని తెలిపారు. పెద్దోళ్లు అయినంత మాత్రాన ఎవరి భూమి పడితే వారిది కబ్జా చేస్తారా? అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు. మీడియా సమక్షంలో భూమి కొనుగోలుకు సంబంధించిన పత్రాలను చూపుతామని, భూమి తమది కాదని నిరూపించే పత్రాలను వెంకటస్వామి చూపిస్తారా? అని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications