వైయస్ జగన్ భేటీ: ఓదార్పుపై చేతులెత్తేసిన మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చేతులెత్తేశారు. శుక్రవారం రాత్రి హైదరాబాదుకు బయలుదేరే ముందు జగన్ మొయిలీని కలిశారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. అయితే, ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని మొయిలీ తేల్చేశారు. ఇదే సమయంలో జగన్ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై ఫిర్యాదు చేశారు. ఓదార్పు యాత్రపై పురంధేశ్వరి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా, ఆమె సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పిన విషయాలను మీడియాకు వెల్లడించడంపై జగన్ అభ్యంతర పెట్టారు. పురంధేశ్వరి పార్టీ వైఖరినే చెప్పారని, అందుకు భిన్నంగా మాట్లాడలేదని మొయిలీ జగన్ కు చెప్పారు.

ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని కొంత మంది పార్లమెంటు సభ్యులు జగన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దానికి జగన్ తీవ్రంగా ప్రతిస్పందించినట్లు సమాచారం. చేతులు ముడుచుకుని కూర్చోవాలా, రాజకీయాలే చేయవద్దా అని ఆయన వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అధిష్టానం వ్యతిరేకంగా ఉంది కదా అంటే తన వైపు దేవుడున్నాడని ఆయన సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు. తాను ఓదార్పు చేపట్టడం ఖాయమని, ఎవరు వచ్చినా రాకున్నా తన ఓదార్పు యాత్ర ఆగదని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర ఎన్ని రోజులైనా జరగవచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+