హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్ మాఫియాతో హీరోయిన్ త్రిషకు లింక్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Trisha
హైదరాబాద్: హీరోయిన్ త్రిషకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదు పోలీసులు విడుదల చేసిన ఫోన్ నెంబర్ల వల్ల ఆ అనుమానాలు ఏర్పడుతున్నాయి. డ్రగ్స్ తో హీరో రవి తేజ సోదరులతో పాటు పట్టుబడిన ఉగండా జాతీయుడు క్లెమెంట్ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా త్రిషకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రచురించింది. నిందితుడు క్లమెంట్ వద్ద ఉన్న క్లయింట్లకు చెందిన 17 మంది ఫోన్ నెంబర్లను పోలీసులు విడుదల చేశారు. క్లెమెంట్ వద్ద ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల కుమారుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. త్రిష, రాజా, సైరాబానుకు చెందిన ఫోన్ నెంబర్లు అందులో ఉన్నాయి.

అలాగే, అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్, తెలుగుదేశం నాయకుడు అరవింద కుమార్ గౌడ్ కుమారుడు వినోద్ గౌడ్ తదితరుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్లు ఆ టీవీ చానెల్ బయటపెట్టింది. వారి ఫోన్ నెంబర్లను కూడా ప్రసారం చేసింది. కాగా, హైదరాబాదులోని 9 పబ్ ల్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఓ ప్రముఖ హీరో, ఓ యువ హీరో పబ్ లు కూడా ఉన్నాయి. క్లెమెంట్ దాదాపు 200 మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దాదాపు 60 మంది ప్రతి రోజూ డ్రగ్స్ వాడుతుండగా 140 మంది ప్రముఖులు వారాంతంలో డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు. విశాఖపట్నం, హైదరాబాదు తదితర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారిని అరెస్టు చేయడానికి వీలు కాదు. కేవలం ఫోన్ నెంబర్ల ఆధారంగా డ్రగ్స్ వాడుతున్నవారిని పట్టుకుని నేరాన్ని రుజువు చేయడం సాధ్యం కాదు. దీంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్లెమెంట్ వద్ద ఉన్న బినామీ నెంబర్లు కూడా కావచ్చునని అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X