సీమలో కుక్కలు, నక్కలుండవు, ప్రజలుంటారు: జెసి దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబుపై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. శాసనసభ్యులు డిఎల్ రవీంద్రారెడ్డి, జెసి దివాకర్ రెడ్డిని ఉద్దేశించి - రాయలసీమలో పులులు, సింహాలు పుడుతాయంటారని, కానీ నక్కలు పుట్టాయని అంబటి రాంబాబు ఇటీవల తిరుపతిలో వ్యాఖ్యానించారు. రాయలసీమలో కుక్కలూ నక్కలూ ఉండవని, ప్రజలుంటారని జెసి దివాకర్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ నాయకత్వం ఎవరికీ కట్టడి చేయదని, ఎవరికి వారే పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని ఆయన అన్నారు.

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ ను ఆయన వ్యతిరేకించారు. దేశానికి ఒక్కటే స్వాతంత్ర్య దినం ఉంటుందని, రాష్ట్రానికో స్వాతంత్ర్య దినం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మన దేశంలో స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ లాంటి వారు అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ కొనసాగితే మంచిదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+