2011కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో గత సంప్రదాయాన్నే పాటిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడం బాధాకరమని కాంగ్రెసు సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ స్టేట్ లో ఉన్న మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రాంతాల్లో విమోచన దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా జరుపుతున్నాయని, అదే పద్ధతిని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆయన విడిగా సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోవద్దని ఆయన సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications