లాస్ వెగాస్: మిస్ మెక్సికో జిమెనా నవరెటా 2010 సంవత్సరానికి విశ్వసుందరి గా నిలిచారు. లాస్ వెగాస్ లో వైభవంగా జరిగిన వేడుకల్లో నిరుటి విజేత అయిన స్టెఫానియా ఫెర్నాండెజ్(వెనిజులా) జిమెనాకు విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు. మిస్ జమైకా యాండీ ఫిలిప్స్, మిస్ ఆస్ట్రేలియా జస్టినా క్యాంపెబెల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. భారత సుందరి ఉషోషి సేన్ గుప్తా తొలి 15 మందిలో కూడా చోటు సంపాదించుకోలేకపోయారు.