సైరాబాను, జ్యోతి వ్యభిచారంపై ఆధారాలున్నాయి: ఎకె ఖాన్

సినీ పరిశ్రమను తాము టార్గెట్ చేస్తున్నట్లు వస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కొంత మంది తప్పుడు వ్యవహారాల్లో పట్టుబడినంత మాత్రాన సినీ పరిశ్రమ అంతటికీ వర్తింపజేయలేమని ఆయన అన్నారు. డ్రగ్స్ మాఫియాకు ముంబైతో సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ విద్యాపరంగా అభివృద్ధి చెందిందని, మిశ్రమ సంస్కృతికి నగరం ఆలవాలమని, అందువల్ల హైదరాబాద్ పై ఆకర్షణతో విదేశీయులు పెద్ద యెత్తున వస్తారని ఆయన చెప్పారు. అందువల్ల భద్రత చర్యలు చేపట్టడం అత్యంత అవసరమని ఆయన అన్నారు. గుర్తింపు కార్డులు లేకుండా సెల్ సిమ్ లు ఇస్తున్నారని, దాని వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications