సినీ రంగం చట్టానికి అతీతం కాదు: చిరంజీవి

భవిష్యత్తు రాజకీయాల్లో తాము కీలక పాత్ర పోషిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ పొత్తులు లేకుండా ఏ పార్టీ కూడా పోటీ చేసే పరిస్థితిలో లేదని ఆయన అన్నారు. భావసారూప్యం గల పార్టీలతో పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. పార్టీ స్థాపించన తొలినాళ్లలో కూడా తాము సిపిఐతో పొత్తుకు సిద్ధపడ్డామని ఆయన గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఆయన చెప్పారు.
ప్రభుత్వం మంచి చేస్తే హర్షిస్తామని, తప్పు చేస్తే వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. సమస్యను జఠిలం చేస్తే పోరాటం చేస్తామని ఆయన అన్నారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అంటామని ఆయన అన్నారు. ప్రతిపక్షమంటే ప్రతిదాన్నీ తూర్పారబట్టడమనేది తమ అర్థం కాదని ఆయన అన్నారు. ప్లీనరీ సమావేశానికి అహ్వానం అందనివారికి ఆయన సారీ చెప్పారు.












Click it and Unblock the Notifications