కొత్త డిజిపిగా అరవింద రావుకు అవకాశం?

Girish kumar
హైదరాబాద్: రాష్ట్ర నూతన పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న అరవిందరావుకే ఆ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత డీజీపీ గిరీశ్‌ కుమార్‌ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌తోపాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జానకి కొండపి, పంకజ్‌ ద్వివేది కమిటీ ఆరుగురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి పంపించింది. ఇందులో అరవిందరావు, గౌతంకుమార్‌, నందన్‌, శివశంకర్‌, ఉమేశ్‌, దినేశ్‌రెడ్డి పేర్లు ఉన్నాయి.

నూతన డిజిపిగా అరవింద రావును నియమిస్తూ నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇంటిలిజెన్స్ చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు. అరవింద రావు 1977 బ్యాచ్ కు చెందిన ఐపియస్ అధికారి. ఆయన దివంగత ప్రధాని పివి నరసింహారావుకు సమీప బంధువు కూడా. అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అరవింద కుమార్ వైపే మొగ్గు చూపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+