ఓదార్పు యాత్ర: ఆ ఎమ్మెల్యేలంతా వైయస్సార్ వ్యతిరేకులా?

YS Jagan
హైదరాబాద్: ప్రకాశం జిల్లా శాసనసభ్యులపై తీవ్రమైన ఒత్తిడి పెట్టడం ద్వారా పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తోంది. పార్టీ అధిష్టానం మాట విని ఓదార్పు యాత్రలో పాల్గొనని శాసనసభ్యులపై జగన్ వర్గం తీవ్రమైన ఒత్తిడి పెడుతోంది. ఓదార్పు యాత్రలో పాల్గొనని శాసనసభ్యులపై స్థానికంగా తమ మనుషుల చేత ఒత్తిడి చేయిస్తూ, మరో వైపు వారిని వైయస్సార్ వ్యతిరేకులుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓదార్పు యాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా లేని శాసనసభ్యులకు పోటీగా ఇతర నాయకులను ప్రోత్సహిస్తోంది. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఓదార్పు యాత్రలకు భిన్నంగా ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రను జగన్ నిర్మాణాత్మకంగా చేపడుతోంది.

ఇప్పటికే 9 మంది చేత కమిటీని ఏర్పాటు చేసింది. రూట్ మ్యూప్ కోసమే ఆ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఆయన నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు పోటీ నాయకత్వాన్ని తయారు చేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. అలాగే, ఓదార్పు కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఓదార్పు యాత్రపై చర్చించేందుకు ఈ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ వర్గం చెబుతోంది. ఓ పార్టీకి కావాల్సిన హంగులను సమకూర్చుకుంటోంది. ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా అధిష్టానానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, వనబాక లక్ష్మిలపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. మొత్తం మీద, తమ మాట వినని శాసనసభ్యులను, మంత్రులను, కేంద్ర మంత్రులను, నాయకులను ఆత్మరక్షణలో పడేసేందుకు జగన్ వర్గం ప్రయత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+