అలాగైతే వైయస్ జగన్ పై వేటు తప్పదు: దానం నాగేందర్

చెప్పుడు మాటలు విని భవిష్యత్తును పాడుచేసుకోవద్దని కూడా ఆయన జగన్ కు సూచించారు. కొంత మంది వైయస్ జగన్ ను చెడగొడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అధిష్టానం సూచన మేరకు నడుచుకుని తండ్రిని మించిన తనయుడని జగన్ అనిపించుకోవాలని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా అధిష్టానాన్ని ధిక్కరించలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పదవి చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీన పునరంకిత సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications