హైదరాబాద్: క్రెడిట్‌కార్డును రెన్యువల్ చేయించుకు రమ్మని ఇస్తే, దాని సహాయంతో రూ.6 లక్షలు కాజేశాడని సినీ దర్శకుడు తేజ ఓ వ్యక్తిపై జూబ్లీహిల్స్‌పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - తేజకు కొంత కాలంగా అవినాష్‌గుప్తాతో పరిచయం ఉంది. తన సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డును రెన్యువల్ చేయించమని చెప్పి తేజ కార్డును అతడికి ఇచ్చారు.
కార్డు ఉపయోగించి అవినాష్ రూ.6లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు. దీన్ని గుర్తించిన తేజ - అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నారు.