వైయస్ జగన్ విషయం హై కమాండ్ చూసుకుంటుంది: రోశయ్య

పార్టీ బలం పుంజుకున్న తర్వాత, పాలన గాడిలో పడిన తర్వాత మంత్రి విస్తరణ ఉంటుందని ఆయన చెప్పారు. పార్టీ బలం పుంజుకోవడానికి, ప్రభుత్వం సక్రమంగా నడిచేలా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ఫైనల్ అని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు తాము నడుచుకుంటామని, మిగతా పార్టీలు కూడా అలా నడుచుకుంటాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. బయ్యారం ఖనిజాన్వేషణపై పునర్విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని, ప్రజానీకమూ ప్రకృతీ సహకరించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications