హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడ్డ తెలంగాణ, సమైక్యాంధ్ర సమస్యను శాంతి యుతంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప..పంతాలకు, ప్రతీకారాలకు పోతే రాష్ట్రంలో మరో మహాభారత యుద్దం తప్పదని జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న కమిటీ ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు. డిసెంబర్ 31 తర్వాత తాము ఇచ్చే నివేదిక సమర్థవంతంగా..సమస్యను పరిష్కరించే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు.