తిరుపతి వేదికగా హైకమాండ్ పై జగన్ క్యాంప్ వార్ డిక్లేర్

కాంగ్రెసు పార్టీతో సంబంధం లేకుండా వైయస్ జగన్ వర్గం తిరుపతిలో వైయస్ వర్ధంతి సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో వక్తలు పార్టీ అధిష్టానంపై, పార్టీలోని జగన్ వ్యతిరేకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ నెల 3వ తేదీ శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతుందని అర్థమవుతోంది. ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ అధిష్టానం మాటను బేఖాతరు చేయడానికే సిద్ధపడినట్లు కూడా అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications