సోనియా గాంధీ చేతిలో వైయస్ జగన్ భవిష్యత్తు

Sonia Gandhi
న్యూఢిల్లీ: అధిష్టానాన్ని ధిక్కరించి ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రను చేపట్టిన కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ భవిష్యత్తు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల్లో ఉంది. పార్టీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమం ఉండడంతో పార్టీ అధిష్టానం శుక్రవారం జగన్ వ్యవహారంపై దృష్టి పెట్టలేకపోయారు. శనివారం జగన్ వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం ఉంది. కొంత మంది సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు మాత్రం యాత్ర గురించి వాకబు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా వరుసగా నాలుగోసారి ఎన్నికయిన సందర్భంగా సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలతో సోనియా శనివారం సోనియా నివాసంలో భేటీ కానున్నారు. శుక్రవారం వర్షం కారణంగా ఈ సమావేశం జరగలేదు.

జగన్‌ ధిక్కార వైఖరి గురించి సోనియా దృష్టికి శనివారం నాటి భేటీలో సీనియర్‌ నేతలు తీసుకువచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కడప ఎంపీ తాజాగా ప్రకాశం జిల్లాలో మొదలు పెట్టిన ఓదార్పు యాత్రను అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ఆయనపై ఏం చర్య తీసుకోవాలనేది అధ్యక్షురాలి నిర్ణయానికే వదిలేస్తామని ఆ వర్గాలు చెప్పాయి. శుక్రవారమే ఎన్నికలు పూర్తయినందున నిర్ణయానికి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపాయి.

కాగా, గురువారం ఇడుపులపాయలో జగన్‌ కుటుంబంతో చర్చలు జరిపిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు వీరప్పమొయిలీ పెదవి విప్పడం లేదు. సోనియాతో కూడా భేటీ కాలేదని, ఆమెకు కూడా చర్చల సారాంశాన్ని వెల్లడించలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. తిరిగి ఈ నెల 6న ఢిల్లీకి చేరుకుంటారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 7న సింగపూర్‌ బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలన్నీ పూర్తయ్యే వరకు ఆయన పెదవి విప్పే అవకాశం లేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+