చంద్రాబబు మొట్టికాయలు: నాగం జనార్దన్ రెడ్డి బేఖాతరు

సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డికి బాబు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆయన అధినేతను ధిక్కరించే రీతిలో మీడియా ముందు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల సీమాంధ్రలో పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందని పలువురు సీమాంధ్ర నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రాంత నేతలు ఎంత రెచ్చగొట్టినా తాము మౌనం వహిస్తుంటే నాగం మాత్రం తమ మనోభావాలతో పాటు అధ్యక్షుడి ఆదేశాలను ఖాతరు చేయడం లేదని వారు ఆరోపించారు. ఇదే అంశంపై నాగంను చీవాట్లు పెట్టినట్టు సమాచారం. నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications