రామోజీరావు ఆటలు సాగవంటున్న వైయస్ జగన్ సాక్షి

Sakshi Daily
హైదరాబాద్‌: ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు ఆటలు సాగవని సాక్షి టీవీ చానెల్, డైలీ వ్యాఖ్యానించాయి. ఈ మేరకు సాక్షి దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రసారం కాగా, సాక్షి టీవీ చానెల్ అదే వార్తాకథనం ప్రసారమైంది. వైయస్ జగన్ పై విషం కక్కుతున్న రామోజీ రావు అటలు సాగవని సాక్షి వ్యాఖ్యానించింది. ప్రకాశం జిల్లా గిద్గలూరు ఓదార్పు యాత్రపై ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్తాకథనంపై మండిపడుతూ సాక్షి ఆ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. గిద్దలూరు యాత్రకు కడప జిల్లా నుంచి ప్రజలను తరలించారని ఈనాడు చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా మండిపడింది. విలువలు లేని రాజకీయాలు చలామణి అవుతుంటే రామోజీ రావు, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఎల్లో రాతలు రాస్తున్నారని విమర్శించింది. రామోజీకి జగన్ యాత్రకు వచ్చిన ప్రజలు కనిపించలేదా అని ప్రశ్నించింది.

వైయస్ జగన్ ను సాధ్యమైనంత త్వరగా బలిపీఠం ఎక్కించాలని ఎల్లో రాతలు రాస్తున్నారని సాక్షి విమర్శించింది. జగన్ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు రోజుకో కట్టు కథ అల్లుతున్నాయని విరుచుకుపడింది. జగన్ కు లభిస్తున్న ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక ఏడ్పు రాతలు రాస్తున్నారని వ్యాఖ్యానించింది. జగన్ లో ప్రజలు మహానేతను చూసుకుంటున్నారని చెప్పుకుంది. ఎల్లో ఎజెండా పేరుతో రామోజీపై, రాధాకృష్ణపై సాక్షి దుమ్మెత్తి పోసింది. ఎల్లో ఎజెండాను మానుకోవాలని సలహా ఇచ్చింది. జగన్ చూసి పల్లెలు పులకరిస్తున్నాయని ప్రశంసించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+